NLG: దివ్యాంగులకు ప్రైవేట్ సంస్థలు జీవన ఉపాధి కల్పించాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోనే ఉన్న ప్రైవేట్ సంస్థలలో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ద్వారా జీవనోపాధి కల్పించాలని కోరారు.