కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో తహసీల్దార్లు, గ్యాస్ డీలర్లతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గంలో గృహ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అపోహలతో అవసరం లేని ఓవర్ గ్యాస్ బుకింగ్ చేయవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.