MNCL: జనాభా లెక్కల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ కలెక్టరెట్లో మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనాభా లెక్కల ప్రాతిపదిక ఉపయోగపడుతుందని తెలిపారు.