ADB: పేదలను ఉపాధి హామీకి దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవి కుమార్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలతో సమావేశమై మాట్లాడారు. వీబీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.