MBNR: మహబూబ్ నగర్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మైసూర్ ఉత్తరాది దత్త పీఠాధిపతి శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ స్వామీజీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామీజీకి శేషవస్త్రంతో ఘనంగా సన్మానం చేశారు.