JGL: ప్రభుత్వ సహకారంతో అందించే రుణాలను లబ్ధిదారులకు బ్యాంకర్లు సకాలంలో అందించి ప్రోత్సహించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జగిత్యాల లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జేఎంఎల్బీసీ నియోజకవర్గ స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.