ATP: పామిడి టీడీపీ సీనియర్ నాయకుడు పి.వి. శివకుమార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆ కుటుంబానికి మంజూరైన రూ. 5 లక్షల చంద్రన్న బీమా చెక్కును గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఆపద వస్తే టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.