సత్యసాయి: హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలో రక్త ఉపభాగాల (బ్లడ్ కాంపోనెంట్స్) వినియోగానికి లైసెన్స్ మంజూరైంది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కృషి వల్ల ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇక్కడ ప్యాక్డ్ రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ సేవలు ప్రారంభం కానున్నాయి.