WNP: అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ మల్లారెడ్డి బీజేపీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా పార్టీ నాయకులు కార్యకర హరీష్, అన్వేష్, సాయిలు, రామంజి, బడా అంజి తదితరులు పాల్గొన్నారు.