BHNG: భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక కొన్నత పాఠశాలలో బుధవారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి ఎంతో చక్కని ప్రతిభను కనబరిచారని వారిని అభినందించారు.