IPL 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ను BCCI అధికారికంగా విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా BCCI తొలి 20 రోజులకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించనుంది. కాగా, ఈ సీజన్లో మొత్తం 84 మ్యాచ్లు నిర్వహించనున్నారు.