E.G: గోకవరం మండలంలో వరుస ద్విచక్ర వాహన చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం గోకవరం SI పవన్ కుమార్ తన సిబ్బందితో కొత్తపల్లి ప్రధాన రహదారిలోని R&R కాలనీ వద్ద తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా ఉంచుతామని, అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని SI సూచించారు.