శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలన )రైల్వే స్టేషన్ను వాల్తేర్ డివిజన్ ADRM ఎమ్.శాంతారావు బుధవారం సందర్శించారు. నూతంగా తయారవుతున్న కాలినడకన వంతెన, రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.