KKD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఈనెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. సామర్లకోట మండలంలో 7,104 మందికి అన్నదాత సుఖీభవ, 6,271 మందికి పీఎం కిసాన్ నిధులు అందుతాయని ఏవో మురళీధర్ రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరికీ నేరుగా నగదు బదిలీ అవుతుందని స్పష్టం చేశారు.