VZM: రామభద్రపురం పెట్రోల్ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు క్షతగాత్రులను పరామర్శించారు. ఈమేరకు గాయపడిన వారికి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.