KKD: గొల్లప్రోలు(M)చెందుర్తిలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి ప్రసాదరావు పాల్గొని, రైతులకు ఆయిల్ పామ్ సాగులో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులపై వివరించారు. ఆయిల్ పామ్ పంటలో ఆటోమేటెడ్ మైక్రో ఇరిగేషన్ (డ్రిప్) వ్యవస్థలను ఉపయోగించడంతో నీటి వినియోగం సమర్థవంతంగా జరిగి మొక్క ఎదుగుతుందన్నారు.