నయం చేయలేని భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ, నరకయాతన అనుభవిస్తున్న వారికి వైద్యుల సహకారంతో మరణాన్ని ప్రసాదించడాన్ని ‘కారుణ్య మరణం’ అంటారు. మన దేశంలో ‘పాసివ్ యుతనేసియా’ (లైఫ్ సపోర్ట్ తొలగించడం) చట్టబద్ధం చేయబడింది. రోగి కోలుకునే అవకాశం లేదని మెడికల్ బోర్డు నిర్ధారించినప్పుడు మాత్రమే, అత్యున్నత న్యాయస్థానం నిబంధనల ప్రకారం గౌరవప్రదంగా మరణించే హక్కును కల్పిస్తారు.