ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడగాల్పుల నివారణకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర హోం మంత్రి వి. అనిత ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల తీవ్రత కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదన్న లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.