AP: రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగ్ రిపోర్ట్ తన మాటలనే చెప్పిందని మాజీ సీఎం జగన్ అన్నారు. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు కాగా, రాబడులు రూ.1,70,767 కోట్లుగా ఉన్నాయన్నారు. రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు, ద్రవ్య లోటు రూ.62,719 కోట్లుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.