AP: ఈనెల 13న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని CM చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతినెలా సంక్షేమ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాం. పోలవరాన్ని 2027లో జాతికి అంకితం చేస్తాం. జూలైలో వెలికొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం. 2027 మార్చికి ఎక్కడా భూవివాదాలు లేకుండా చేస్తాం. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగితే సహించేది లేదు’ అంటూ హెచ్చరించారు.