MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు డివైడర్ మధ్యలో పెరిగిన కోనోకార్పాస్ చెట్ల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ మొక్క చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. మనుషులకు కూడా అంతే కీడు చేస్తుందని ప్రచారం. అధికారులు తక్షణమే స్పందించి కోనో కార్పాస్ చెట్లను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.