TG: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు(82) పార్థివ దేహాన్ని సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసానికి తీసుకువస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. తన తాత అంత్యక్రియలను మార్చి 12న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, కావూరు సాంబశివరావు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.