NDL: డోన్ పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. వైద్యాధికారి గ్రేసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, చర్మం, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులను వైద్యులు పరీక్షించారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ప్రజలు ఆయుర్వేద వైద్యం వినియోగించుకోవాలని సూచించారు.