దేశంలో F1 రేస్ పునరుద్ధరణకు కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ‘ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. మోటార్‌స్పోర్ట్స్‌ను దేశ క్రీడా వ్యవస్థలో ఎలా అంతర్భాగం చేయాలనే అంశంపై చర్చించారు. ఇప్పటికే మంత్రి గ్రేటర్ నోయిడాలోని F1 ట్రాక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.