TPT: రాపూరు చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి సోమశిల జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అలాగే అర్హులైన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అందిస్తున్నామని చెప్పారు.