AP: అసత్యాలు, అబద్ధాలు చెప్పేందుకే మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘వైసీపీ హయాంలో కాగ్ ఇచ్చిన నివేదికను కూడా జగన్ చదివి వినిపించాలి. నెయ్యి కల్తీ, పరకామణి చోరీ కేసులో ఆయన ప్రమేయమందని అనుమానం ఉంది. జగన్ పాలన స్వర్ణయుగం కాదు.. రాక్షసయుగం. మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు’ అని విమర్శించారు.