E.G: మండపేట పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ CH. నాగ నరసింహరావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నాటికి పుర పాలక సంఘం కౌన్సిల్ ఐదేళ్ల కాల పరిమితి ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఆయా పుర పాలక సంఘం లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.