AP: వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని హైకోర్టులో గురుమూర్తి పిటిషన్ వేశారు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని కోర్టు ప్రశ్నించింది. పారిశ్రామికాభివృద్ధికి భూకేటాయింపులు అవసరమని, వాటిని అడ్డుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందని అభిప్రాయపడింది.