ప్రముఖ బ్రాండ్ ఎవరెస్ట్ మసాలాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. వీటిలో పరిమితికి మించి ఎంటరోబాక్టీరియాసియే బ్యాక్టీరియా, ఎరువుల అవశేషాలు ఉన్నట్లు తాజాగా తేలింది. వీటివల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గరం మసాలా, కిచెన్ కింగ్ వంటి ఉత్పత్తులు వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.