TPT: విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా సీఐ ఏవీ రమణ వెంకటగిరి పట్టణంలోని కాశిపేట సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా యువత, ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర సేవల కోసం Shakti App వినియోగం మరియు Dial 112 India ప్రాముఖ్యతను వివరించారు.