బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టుకు తొలి వన్డేలోనే పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్.. బంగ్లా బౌలర్ నహిద్ రానా (24/5) ధాటికి కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి.. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.