ప్రఖ్యాత యాపిల్ తన శ్రేణిలో విప్లవాత్మక మార్పులు చేస్తూ iPhone 17eని తీసుకు వచ్చింది. తాజా హ్యాండ్స్-ఆన్ రివ్యూల ప్రకారం.. ఈ ఫోన్ కేవలం పేరుకే ‘బడ్జెట్’ మోడల్ అని, ఫీచర్ల పరంగా మాత్రం ఫ్లాగ్షిప్ ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘SE’ మోడళ్ల కంటే ఇది చాలా భిన్నంగా, ఆధునిక డిజైన్, శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో రూపొందించబడింది.