టీ20 ప్రపంచకప్ తర్వాత ఎక్కడ చూసిన సంజూ శాంసన్ పేరే వినిపిస్తుంది. సంజూ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో సోషల్ మీడియాలో అతడి ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రపంచకప్ టోర్నీ ప్రారంభానికి ముందు సంజూకు ఇన్స్టాలో 11 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, టోర్నీ ముగిసేసరికి ఆ సంఖ్య 18 మిలియన్లకు చేరుకుంది. దీన్నిబట్టి సోషల్ మీడియాలో శాంసన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో చెప్పవచ్చు.