కోనసీమ: పాడి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే విడుదల చేశారు. పశువుల సోకే గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.