TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి KTR తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ జోకర్ రాహుల్ గాంధీ అంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపు తీర్పు విషయంలో స్పీకర్ వెనకాల ఉంది రాహుల్ గాంధీయే అని ఆరోపించారు. మళ్లీ ఈయననే రాజ్యాంగం పట్టుకుని తిరుగుతారని ఎద్దేవా చేశారు. అలాగే రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతీ నిర్ణయం వెనకాల రాహుల్ గాంధీ ఉన్నారని ధ్వజమెత్తారు.