GNTR: పొన్నూరు పట్టణంలోని జీబీసీ (GBC) రోడ్డులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల వైపు వెళ్తున్న ధాన్యం లోడు ట్రాక్టర్ వీజే గ్రాండ్ హోటల్ వద్ద స్కూటీని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.