కృష్ణా జిల్లా శివాలయంలో నగదు మాయంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకుపైగా నగదు మాయం చేసినట్లు తెలుస్తోంది. అంతరాలయం హుండీ మారుతాళం తయారుచేసి భారీగా నగదు చోరీకి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పూజారులతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.