రెబల్ స్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు టాక్. దర్శకుడు సుజీత్ ‘సాహో’, ‘OG’ మూవీలను కలిపి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఈ మల్టీస్టారర్ వార్తలు ఊపందుకున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మించే అవకాశం ఉంది. మరి సుజీత్ దర్శకత్వంలోనే ఈ పవర్-రెబల్ కాంబో సెట్ అవుతుందో లేక సరికొత్త దర్శకుడు వస్తాడో చూడాలి.