AP: గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తాం. గత పాలనలో ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే.. మేం ట్రూడౌన్ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం’ అని వెల్లడించారు.