MDK: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామాయంపేట ఫైర్ సిబ్బంది సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పలు ప్రైవేటు పాఠశాలలు, నివాస గృహాలు, అపార్ట్మెంట్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు.