TG: గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారడమే కాకుండా, అక్కడున్న భారతీయులు, తెలంగాణ వాసుల పాలిట శాపంగా మారాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో చిన్నపిల్లలు, సామాన్యలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ అశాంతి త్వరగా ముగిసి శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.