KDP: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని పీడీ డ్వామా ఆదిశేషారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం చెన్నూరు మండలంలోని రాచినాయపల్లె, రామనపల్లె గ్రామ పంచాయతీల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. ఇప్పటికే పూర్తైన పనులకు వెంటనే ఎం-బుక్లో నమోదు చేసి సంబంధిత కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని తెలిపారు.