VSP: జిల్లా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. నేవీ సిబ్బంది దిగిపోమని హెచ్చరించినప్పటికీ అతడు మరింత పైకి ఎక్కడంతో వైర్లు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.