NRPT: కర్ణాటకలో కుల సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో బుధవారం మరికల్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కృష్ణా-మాగనూరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, రాయచూరు వెళ్లే వాహనాలను నారాయణపేట మీదుగా పంపిస్తున్నారు. మక్తల్, మాగనూరు, రాయచూరు వెళ్లే ప్రయాణికులు ఈ మార్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.