E.G: దేవరపల్లి జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణాన్ని మినీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఎం. వెంకటరాజు తెలిపారు. SAAP ద్వారా టేబుల్ టెన్నిస్ హాల్, బ్యాడ్మింటన్ కోర్టు, జిమ్, డ్రెస్సింగ్ రూమ్స్తో పాటు కోకో, కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు పెద్దపీఠ వేస్తున్నారని చెప్పారు.