కోనసీమ: రాంబిల్లి మండలం లోవపాలెం ఎన్టీఆర్ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల జనసేన అధ్యక్షుడు పప్పల నూకన్నదొర, రాంబిల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎరిపల్లి చిట్టిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు చొరవతో రూ.10 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు.