HYD: తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పురుషుల, మహిళల త్రోబాల్ జట్లకు యూసఫ్‌గూడలో ప్లేయింగ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. మార్చి 13-15 వరకు తిరుపతిలో జరిగే 34వ ఫెడరేషన్ కప్, 17వ సౌత్ జోన్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు పాల్గొననున్నాయి.