శ్రీకాకుళం తోటపాలెం జంక్షన్ వద్ద ఉన్న విశ్వహిందూ పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఆకతాయిలు అలజడి ఎక్కువగా ఉందని బజరంగధల్ సభ్యులు తెలిపారు. ఈ బుధవారం శ్రీకాకుళం టూ టౌన్ సీఐ ఈశ్వరరావుకు వీహెచ్పీ సభ్యులు ఫిర్యాదు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాత్రి వేళలో కార్యాలయం వద్ద మందు బాబులతో పాటు, కార్యాలయంలో పలువురు దొంగతనాలు జరుగుతున్నాయి అన్నారు.