NLG: చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముత్యాల సర్వయ్య యాదవ్ ఇవాళ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA రమావత్ రవీంద్ర కుమార్, కేతావత్ భిల్యానాయక్ ఆధ్వర్యంలో సుమారు 1,000 మందితో పార్టీలో చేరినట్లు తెలిపారు. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.