ELR: HPV వ్యాక్సిన్ రక్షణ కోసం ఒక టీకా అని కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం కాగుపాడు పీహెచ్సీ కేంద్రంలో బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు పైబడిన బాలికల అందరికీ ఈ టీకా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో PHC సిబ్బంది పాల్గొన్నారు.